News June 29, 2024
డీఎస్.. రాజకీయ ఉద్దండుడు
TG: డీఎస్ పేరుతో రాజకీయాల్లో ప్రాచుర్యం పొందిన మాజీ మంత్రి <<13529338>>డి.శ్రీనివాస్<<>>.. NSUI ద్వారా పొలిటికల్ అరంగేట్రం చేశారు. 1989, 1999, 2004లో MLAగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన ఆయన CM రేసులో నిలిచినా చివరికి ఆ పదవి YSRకు దక్కింది. ఇక 2014 తర్వాత BRSలో చేరిన ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు.
Similar News
News October 4, 2024
ప్రతీకార దాడికి DEADLY WEAPONS సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి సైబర్ వార్‌ఫేర్‌కు దిగొచ్చని విశ్లేషకుల అంచనా. ది బెస్ట్ సైబర్ టీమ్ UNIT 8200 వారి సొంతం. కోవర్ట్ ఆపరేషన్స్ చేపట్టిన అనుభవం దీనికుంది. పేజర్ పేలుళ్ల మాదిరిగా ఇరాన్ మిలిటరీ, న్యూక్లియర్, ఆయిల్ ఫెసిలిటీస్‌పై సైబర్ అటాక్స్ చేయొచ్చని తెలిసింది. గతంలో నటాంజ్ న్యూక్లియర్ సైట్‌లో Stuxnet కంప్యూటర్ వైరస్ దాడితో ఇరాన్ విలవిల్లాడింది.
News October 4, 2024
ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు
APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.
News October 4, 2024
USలో 27 ఏళ్లు వచ్చినా కొందరు చిన్నపిల్లలే: సర్వే
అమెరికా అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ అక్కడున్న వారు ఆలోచనల్లో కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. ‘టాకర్ రీసెర్చ్’ సర్వే ప్రకారం చాలా మంది అమెరికన్లు 27 ఏళ్లు వచ్చాకే లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారని తేలింది. ఇందులో 11% మంది ఇంకా పెద్దవాళ్లం కాలేదన్నారు. అడల్ట్‌హుడ్ అంటే బిల్లులు చెల్లించడమేనని 56% మంది చెప్పారు. 45% మంది ఆర్థిక స్వాతంత్ర్యం, బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడమన్నారు.