News March 30, 2024
ఎన్నికల తర్వాతే డీఎస్సీ, టెట్ ఫలితాలు: ఈసీ

AP: ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.
Similar News
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్స్టాలో ఆర్టికల్ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.