News June 20, 2024
DSC.. నేడే చివరి తేదీ
TG: టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి DSC దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి FEBలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. నిన్న సా. వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. tsdsc.aptonline.in/tsdsc/
Similar News
News September 19, 2024
భారత చెస్ జట్లు అదుర్స్!
చెస్ ఒలింపియాడ్ -2024లో భారత చెస్ జట్లు అదరగొడుతున్నాయి. టోర్నీ ప్రథమార్థం తర్వాత ఓపెన్, మహిళల జట్లూ అజేయంగా నిలిచి మొదటిస్థానంలో నిలిచాయి. రెండు జట్లూ వరుసగా చైనా, జార్జియాను ఓడించి 14 మ్యాచ్ పాయింట్లను సాధించాయి. ఇంకా నాలుగు రౌండ్‌లు మిగిలి ఉండగా, రెండు విభాగాల్లోనూ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. మరిన్ని విజయాలు భారత్ కైవసం కావాలని నెటిజన్లు కోరుతున్నారు.
News September 19, 2024
కంటిచూపు మెరుగుపడాలంటే..
*పాలకూర, తోటకూర, కొలార్డ్ గ్రీన్స్ లాంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
* విటమిన్ E ఎక్కువగా ఉండే బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ విత్తనాలు తినాలి.
*స్వీట్ పొటాటోల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. రేచీకటిని తగ్గిస్తుంది.
*ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష లాంటి సిట్రస్ పండ్లతో పాటు క్యారెట్లు తినాలి.
News September 19, 2024
ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు
AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.