News September 5, 2024

నిధుల కొరతతో ధరల పెంపు, సబ్సీడీల కోత.. పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాలు

image

ఆర్థిక వ‌న‌రుల కొర‌త‌తో పంజాబ్ ప్ర‌భుత్వం రిటైల్ ఇంధన ధరలను పెంచింది. అలాగే 7 కిలోవాట్ల లోడ్ ఉన్న గృహ వినియోగదారులకు సబ్సిడీతో కూడిన విద్యుత్ పథకాన్ని కూడా ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. లీటరు పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసల పెంపు ద్వారా ఏడాదికి రూ.1,500-1,700 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూర్చుకోనుంది.

Similar News

News September 20, 2024

పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్

image

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

News September 20, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం

image

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా వందలాది రాకెట్లతో విరుచుకుపడింది. దాదాపు 140 రాకెట్ లాంఛర్లతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ విషయాన్ని ఆ దేశం కూడా ధ్రువీకరించింది. కాగా ఇప్పటివరకు హమాస్ అంతమే లక్ష్యంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను కూడా టార్గెట్ చేసింది. దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

News September 20, 2024

కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్‌రావు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.