News October 12, 2024

జగన్మాతగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

image

AP: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విజయవాడ దుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.

Similar News

News November 11, 2024

TGPSC ఛైర్మన్ నియామకానికి నోటిఫికేషన్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20న సా.5 గంటల వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316, TGPSC నియమావళి-2014 ప్రకారం అభ్యర్థులు అర్హతలు కలిగి ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం వచ్చే నెల 3తో ముగియనుంది.

News November 11, 2024

ALERT: 3 రోజులు భారీ వర్షాలు

image

AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDM తెలిపింది. రేపు ఈ <<14585013>>జిల్లాల్లో<<>> వర్షాలు కురవనుండగా ఎల్లుండి అల్లూరి, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూల్, నంద్యాలలో వానలు పడతాయని పేర్కొంది. 14న కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.

News November 11, 2024

ఏపీలో బీసీ కులాలపై ప్రభుత్వం ప్రకటన

image

AP: రాష్ట్రంలో మొత్తం 138 బీసీ కులాలు ఉన్నాయని, వీటిని 5 గ్రూపులుగా వర్గీకరించినట్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. BC-Aలో 51, BC-Bలో 27 కులాలు, BC-Cలో ఒక కులం, BC-Dలో 45, BC-Eలో 14 కులాలు ఉన్నట్లు తెలిపింది. క్రిస్టియన్లుగా మతం మారిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు BC-Cలోకి వస్తారని, ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారిని BC-Eలుగా గుర్తించినట్లు పేర్కొంది.