News October 12, 2024
కురచ దుస్తులతో దుర్గమ్మ మండపానికి.. భక్తుల ఫైర్

కోల్‌కతాకు చెందిన ముగ్గురు మోడల్స్ కురచ దుస్తులతో దుర్గామాతను దర్శించుకున్నారు. దీనిపై భక్తులు వారిని తిట్టి పోస్తున్నారు. మాజీ మిస్ కోల్‌కతా హేమో శ్రీ భద్ర, మరో ఇద్దరు మోడళ్లతో కలిసి అసభ్యకర దుస్తుల్లో దుర్గామాతను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన భక్తులు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలని తిడుతున్నారు.
Similar News
News November 14, 2025
బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.
News November 14, 2025
పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

కొందరు పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసీజ్ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
News November 14, 2025
రెండో రౌండ్‌లోనూ సేమ్ సీన్

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో నవీన్‌కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.


