News September 20, 2024

కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్

image

TG: సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సంస్థలోని 25 వేల మందికి రూ.5,000 ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క తెలిపారు. దసరా పండగకు ముందే ఈ మొత్తాన్ని వారికి అందించనున్నట్లు చెప్పారు. అటు 41వేల మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులకు బోనస్ కింద ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు అందనున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది రూ.20వేలు బోనస్ అదనంగా అందుతోంది.

Similar News

News October 11, 2024

మేం చదువు చెబితే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు ఇచ్చారు: రేవంత్

image

TG: తాము 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు విద్య, పేదలకు వైద్యం ఇవ్వడం తమ విధానం అయితే.. చేపలు, గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కేసీఆర్ విధానం అని ఫైరయ్యారు. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ వేర్వేరుగా స్కూళ్లు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం అన్ని కులాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

News October 11, 2024

ఎన్డీయేకు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోండి.. నితీశ్‌ను కోరిన అఖిలేశ్‌

image

NDA ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బిహార్ సీఎం నితీశ్‌ను కోరారు. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ జయంతి సంద‌ర్భంగా లక్నోలోని JPNICకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నితీశ్‌కు అఖిలేశ్ ఈ మేరకు విన్నవించారు. దీంతో ఆయన ఇంటి బయటే ఉన్న JP విగ్రహానికి నివాళులర్పించారు. ‘విధ్వంసకర భావాలున్న BJP, CM యోగికి JP లాంటి మహనీయుల గొప్పదనం ఏం తెలుసు?’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు.

News October 11, 2024

‘విశ్వంభర’ టీజర్ లాంచ్ వేదిక ఫిక్స్?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ టీజర్ లాంచ్ వేదికను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్‌లో రిలీజ్ చేస్తారని సమాచారం. కాగా చిరు అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వశిష్ఠ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు.