News October 12, 2024
చెడుపై మంచి సాధించిన విజయమే దసరా

అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు దసరాను జరుపుకుంటారు. దీని వెనుక వేర్వేరు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సురులను, ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు. సీతను అపహరించిన రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు ఇదే రోజున విజయం సాధించారని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయంకరంగా ఉన్నా అంతిమ విజయం మంచిదేనని ఈ పండుగ చాటి చెబుతోంది.
Similar News
News November 7, 2025
సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.
News November 7, 2025
భారీ జీతంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

<
News November 7, 2025
ఆత్మవిశ్వాసాన్ని నింపే ‘వందేమాతరం’: మోదీ

వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 150వ స్మారకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం’ అని పేర్కొన్నారు.


