News August 25, 2024

కరీంనగర్ చేరుకున్న ఈ-బస్సులు.. త్వరలో రోడ్లపైకి

image

TG: జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు TGSRTC సిద్ధమైంది. ఈమేరకు కరీంనగర్-2 డిపోకు ఇవాళ ఈ-బస్సులు చేరుకున్నాయి. డిపోకు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా 33 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. డిపోలో ఇప్పటికే 11కేవీ విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3 ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు.

Similar News

News September 12, 2024

ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?

image

* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.

News September 12, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

image

పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.

News September 11, 2024

మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి

image

తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.