News April 5, 2024

ఫొటోలు షేర్ చేస్తూ నెలకు రూ.17 లక్షలు సంపాదిస్తోంది!

image

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ లక్షలు సంపాదిస్తుంటారు. ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన లిల్లీ రైన్.. సోషల్ మీడియాలో తన ప్రయాణ ఫొటోలు షేర్ చేస్తూ నెలకు 20వేల డాలర్లు (రూ.17 లక్షలు) సంపాదిస్తోంది. అయితే ఆమె మనిషి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించారు. కానీ, ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆమె అందానికి, ట్రావెల్ ఫొటోలకు ముగ్ధులై లక్షల మంది ఫాలో అవుతున్నారు.

Similar News

News January 23, 2025

ఆస్కార్ నామినీల ప్రకటన.. లిస్ట్‌లో హిందీ మూవీ

image

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటితో పాటు పలు విభాగాల్లో నామినీలను ప్రకటించారు. వీటిలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. అవార్డు విజేతలను భారత కాలమానం ప్రకారం మార్చి 3న ప్రకటించనున్నారు.

News January 23, 2025

సరుకుతో పాటు ప్రయాణికులతో వెళ్లే రైళ్లు

image

ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఫ్రైట్ కమ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కింది అంతస్తులో సరుకు, పైన ప్రయాణికులు వెళ్లేలా డబుల్ డెక్కర్ లాంటి రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్డు రవాణాతో పోటీ పడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

News January 23, 2025

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్

image

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.