News February 17, 2025
ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News December 2, 2025
జగిత్యాల జిల్లాలో నెలరోజులు పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల(D) పరిధిలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ యాక్ట్ 1861 అమలులోకి వచ్చినట్లు SP అశోక్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 31 వరకు పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాగే డీజే వినియోగం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని SP కోరారు.
News December 2, 2025
శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్పైరీ ఫుడ్ అంటూ!

శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వం అత్యవసర మానవతా సాయాన్ని అందించింది. అయితే ఇది చూసిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా శ్రీలంకకు ఫుడ్ ప్యాకేజీలను పంపింది. ఈ విషయాన్ని అక్కడి పాక్ హైకమిషనర్ కార్యాలయం ట్వీట్ చేయగా.. ఎక్స్పైరీ ఫుడ్ పంపినట్లు నెటిజన్లు గుర్తించారు. ఇలా పాడైపోయిన వాటిని పంపి డప్పు కొట్టుకోవడం ఎందుకంటూ మండిపడుతున్నారు.
News December 2, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* పిజ్జా చల్లబడి, గట్టిపడితే ఒక గిన్నెలో పిజ్జా ముక్కలు పెట్టి.. మరో గిన్నెలో వేడి నీళ్లు పోసి, అందులో పిజ్జాముక్కల గిన్నెను 5 నిమిషాలు ఉంచితే చాలు.
* ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్లు మండుతుంటే ఒక టిష్యూ పేపర్ను తడిపి, దానిపై ఉల్లిగడ్డను కట్ చేస్తే కళ్లు మండవు.
* గిన్నెలు మాడిపోయినప్పుడు ఓ గ్లాస్ పెప్సీని మాడిపోయిన గిన్నెలో పోసి వేడి చేసి, 10 నిమిషాల తర్వాత కడిగితే గిన్నెలు మెరిసిపోతాయి.


