News February 17, 2025
ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో భయాందోళనలకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News March 19, 2025
రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.
News March 19, 2025
పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 19, 2025
ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.