News July 12, 2024
జమ్మూకశ్మీర్‌లో భూకంపం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదైంది. లద్దాక్‌లోని లేహ్‌లోనూ 3.6 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
Similar News
News February 18, 2025
నేటి నుంచి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ఎల్‌నినో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు ఉంటాయని, అనేక ప్రాంతాల్లో 38డిగ్రీలు నమోదవుతాయంటున్నారు. ఇక APలో సాధారణం కంటే 2-4డిగ్రీలు గరిష్ఠంగా ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజయనగరం, అనకాపల్లి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాయలసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువని అంచనా.
News February 18, 2025
నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.
News February 18, 2025
పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.