News August 26, 2024

భూకంపం సృష్టిస్తా: తీన్మార్ మల్లన్న

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని MLC తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ‘రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరు. తెలంగాణలో BC సర్కార్ రాబోతోంది. BCలను గెలిపించేలా KCRకు వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుంది’ అంటూ ఆవేశంగా మాట్లాడారు.

Similar News

News November 18, 2025

రెండు రోజులు జాగ్రత్త!

image

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు.

మూవీ ముచ్చట్లు

image

*కల్ట్ క్లాసిక్ సినిమా ‘షోలే’ డిసెంబర్ 12న థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.
*మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో చేతులు కలిపిన దర్శకుడు ప్రశాంత్ నీల్. పూజా కార్యక్రమంతో హారర్ చిత్రం ప్రారంభం. సమర్పకుడిగా వ్యవహరించనున్న నీల్.
* ‘వారణాసి’ వీడియోకు అద్భుత స్పందన రావడంతో సాంకేతిక బృందానికి థాంక్స్ చెప్పిన రాజమౌళి. ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ ట్వీట్.