News April 16, 2025
34 ఏళ్లలో 58 సార్లు ఇండియాలో భూకంపం!

1990 నుంచి 2024 వరకు సంభవించిన భూకంపాల్లో అత్యధికంగా చైనాలో నమోదైనట్లు NOAA తెలిపింది. అక్కడ 186 సార్లు భూమి కంపించింది. దీని తర్వాత జపాన్లో 98, అమెరికాలో 78, ఇండియాలో 58సార్లు భారీ భూకంపాలు వచ్చినట్లు పేర్కొంది. ఇంకా ఎక్కువ సార్లే భూమి కంపించినా ఇవి $1మిలియన్ ఆస్తి నష్టం, 10+ మరణాలు సంభవించిన వాటి వివరాలు మాత్రమే. కాగా, 1923లో సంభవించిన జపాన్ భూకంపంలో అత్యధికంగా 1,42,807 మంది చనిపోయారు.
Similar News
News November 26, 2025
BREAKING: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు

AP: మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడినట్లు APSDMA వెల్లడించింది. దీనికి ‘సెన్యూర్’ అనే పేరు పెట్టినట్లు తెలిపింది. ఇది 24 గంటల తర్వాత క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా, 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంది. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News November 26, 2025
అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

AP: విద్యార్థులు ప్రాథమిక హక్కులనే కాకుండా ప్రాథమిక బాధ్యతలనూ తెలుసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏదైనా అంశంపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 175 మంది స్టూడెంట్లతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను గౌరవించిన, అన్ని రంగాల్లో ప్రోత్సహించిన దేశమే అభివృద్ధి చెందుతుంది. అమ్మాయిలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.