News April 16, 2025

34 ఏళ్లలో 58 సార్లు ఇండియాలో భూకంపం!

image

1990 నుంచి 2024 వరకు సంభవించిన భూకంపాల్లో అత్యధికంగా చైనాలో నమోదైనట్లు NOAA తెలిపింది. అక్కడ 186 సార్లు భూమి కంపించింది. దీని తర్వాత జపాన్‌లో 98, అమెరికాలో 78, ఇండియాలో 58సార్లు భారీ భూకంపాలు వచ్చినట్లు పేర్కొంది. ఇంకా ఎక్కువ సార్లే భూమి కంపించినా ఇవి $1మిలియన్ ఆస్తి నష్టం, 10+ మరణాలు సంభవించిన వాటి వివరాలు మాత్రమే. కాగా, 1923లో సంభవించిన జపాన్ భూకంపంలో అత్యధికంగా 1,42,807 మంది చనిపోయారు.

Similar News

News April 19, 2025

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

image

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.

News April 19, 2025

అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

image

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

News April 19, 2025

ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

image

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!