News January 6, 2025

టైమ్‌పాస్‌కు తినండి.. పోషకాలు పొందండి

image

వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం టైమ్‌పాస్‌గా గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.

Similar News

News January 7, 2025

బెంగళూరు కంటే ముందుగానే అక్కడ hMPV

image

దేశంలో బెంగళూరు కంటే ముందే మరో ప్రాంతంలో hMPV కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలోని షిమోగాలోని ప్రైవేటు ఆసుపత్రిలో 6 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే గత నవంబర్‌లోనే వీటిని గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన వారు 1-2 ఏళ్ల పిల్లలే కాగా ప్రస్తుతం వీరు కోలుకున్నట్లు సమాచారం. మరోవైపు నిన్న, ఇవాళ దేశంలో 8 కొత్త కేసులు వెలుగు చూశాయి.

News January 7, 2025

భారత జట్టుకు శాపంగా బుమ్రా గాయాలు

image

బుమ్రా కెరీర్‌లో గాయాలు టీమ్ ఇండియాకు శాపంగా మారాయి. తిరిగి కోలుకొని జట్టులోకి వచ్చిన ప్రతిసారీ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నా ఆయన దూరమైన మ్యాచుల్లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. 2018 నుంచి అదే కొనసాగుతోంది. ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ చేయడం బుమ్రా ప్రత్యేకత. తాజాగా AUSతో చివరికి టెస్టు మధ్యలోనే మైదానాన్ని వీడటం ఆందోళనకు కలిగిస్తోంది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన ప్రదర్శనే కీలకం కానుంది.

News January 7, 2025

సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

image

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆయన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఈ ఉదయం తోసిపుచ్చడం తెలిసిందే. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ తనపై ACB కేసులు కొట్టివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు KTR పిటిషన్ వేస్తే విచారణలో తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే SCలో కేవియట్ వేసింది.