News January 6, 2025
టైమ్‌పాస్‌కు తినండి.. పోషకాలు పొందండి
వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం టైమ్‌పాస్‌గా గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.
Similar News
News January 22, 2025
భారత్ పిచ్‌పై తేలిపోయిన RCB బ్యాటర్లు!
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ ప్లేయర్లు ఫిల్ సాల్ట్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (0), జాకబ్ బేథేల్ (7) ఘోరంగా విఫలమయ్యారు. వీరందరూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఈ ముగ్గురినీ ఆ ఫ్రాంచైజీ భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. కానీ ఉపఖండంలో ఆడిన తొలి మ్యాచులో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
News January 22, 2025
GREAT: పొద్దున పోలీస్.. సాయంత్రం టీచర్
హరియాణాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అజయ్ గ్రేవాల్ రోజంతా ఉద్యోగం చేసి, సాయంత్రం ఉపాధ్యాయుడిగా మారుతారు. 2016 నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువకులకు ఉచితంగా UPSC, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ అందిస్తున్నారు. ఇంటి టెర్రస్‌పైనే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లిష్, హిందీ వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఇప్పటివరకు ఆయన కోచింగ్ వల్ల 3వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినట్లు సమాచారం.
News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి
తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.