News December 10, 2024
రాత్రి 9 గంటల తర్వాత తింటున్నారా?

ప్రస్తుత బిజీ లైఫ్లో రాత్రి పూట కొందరు ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. కానీ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం, నిద్ర లేమి, బీపీ, షుగర్ వంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల కొవ్వు పెరిగి ఊబకాయం రావచ్చు. అందుకే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య తినడం ఉత్తమం.
Similar News
News January 30, 2026
అప్పుడే కొని ఉంటే బాగుండేది..!

అని బంగారం, వెండి కొనుగోలుపై అనుకుంటున్నారా? ‘ఇక పెరగదు’ అనుకున్న ప్రతిసారీ వీటి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొందామని వాయిదా వేసుకున్నవాళ్లు ‘అప్పుడే కొని ఉంటే బాగుండేది’ అని నిట్టూరుస్తున్నారు. అటు ఏకంగా రూ.వేలల్లో ధరలు ఎగబాకుతుండటంతో వడ్డీ తీసుకొని అయినా వీటిపై పెట్టుబడి పెడితే బాగుంటుందనే చర్చ ట్రెండ్ అవుతోంది. మరోవైపు బ్యాంకుల్లో పుత్తడిపై లోన్లు తీసుకొనేవారూ ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.
News January 30, 2026
కేజీ చికెన్ రూ.350, మటన్ రూ.1500!

TG: మేడారం జాతరలో వ్యాపారులు చికెన్, మటన్ ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బయట కేజీ మటన్ ధర రూ.900-1000 ఉండగా, మేడారంలో రూ.1500కి విక్రయిస్తున్నారు. కిలో లైవ్ కోడి బయట రూ.170 ఉండగా, జాతరలో రూ.350కి అమ్ముతున్నారు. మద్యం బాటిళ్లపై రూ.100 చొప్పున పెంచినట్లు సమాచారం. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును రూ.1000-రూ.2000కి అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.
News January 30, 2026
మార్చినాటికి విజయవాడ బైపాస్ పూర్తి: గడ్కరీ

AP: గొల్లపూడి నుంచి చినకాకాని(17.88KM) వరకు చేపట్టిన VJA బైపాస్ MARనాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. లోక్సభలో MP బాలశౌరి అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టులో 4KM మేర మాత్రమే పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని మార్చి31 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. 2019లో ఈ 6వరసల బైపాస్ నిర్మాణానికి రూ.1,194cr అంచనావ్యయంతో అనుమతులిచ్చారు.


