News December 1, 2024

మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా?

image

ఇంట్లో ఉన్న బంగాళదుంపలు కొన్ని రోజులకే మొలకెత్తుతుంటాయి. అయితే, వాటిని పట్టించుకోకుండా వండుకుని తినేస్తుంటాం. ఇలాంటి వాటిని తినడం వల్ల వికారం, తలనొప్పి, జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళ దుంపలు సోలనిన్& చాకోనిన్ వంటి సహజమైన టాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే, చిన్నగా మొలకలు వస్తే వాటిని కట్ చేయొచ్చని, పెద్దగా పెరిగితే మాత్రం తినొద్దని చెప్తున్నారు.

Similar News

News November 27, 2025

ఆదిలాబాద్: సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవ తీర్మాణం

image

ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సర్పంచ్‌తో పాటు 8 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్ పరిధిలోని సాలెగూడ, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పటేల్‌ల ఆధ్వర్యంలో సమావేశమై, కోవా రాజేశ్వర్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.