News December 1, 2024
మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా?

ఇంట్లో ఉన్న బంగాళదుంపలు కొన్ని రోజులకే మొలకెత్తుతుంటాయి. అయితే, వాటిని పట్టించుకోకుండా వండుకుని తినేస్తుంటాం. ఇలాంటి వాటిని తినడం వల్ల వికారం, తలనొప్పి, జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళ దుంపలు సోలనిన్& చాకోనిన్ వంటి సహజమైన టాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే, చిన్నగా మొలకలు వస్తే వాటిని కట్ చేయొచ్చని, పెద్దగా పెరిగితే మాత్రం తినొద్దని చెప్తున్నారు.
Similar News
News February 17, 2025
IPL.. ఈ జట్లకు కెప్టెన్లు ఎవరు?

IPL-2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇటీవలి వేలంలో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఆయా ఫ్రాంచైజీలను వీడారు. RCB తమ కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించలేదు. KKRలో రహానే, వెంకటేశ్ అయ్యర్, నరైన్, రింకూ.. DCలో KL రాహుల్, అక్షర్ పటేల్, డుప్లిసెస్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో కామెంట్ చేయండి.
News February 17, 2025
ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.
News February 17, 2025
RECORD: 84 ఏళ్ల కాపురం.. 100+ గ్రాండ్ చిల్డ్రన్

దాంపత్యంలో చిన్న విభేదాలకే విడిపోతున్న ఈ రోజుల్లో 84ఏళ్ల తమ కాపురంతో రికార్డు సృష్టించిన ఓ జంట అందరికీ స్ఫూర్తినిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన మనోయిల్(105), మరియా(101)కు 1940లో పెళ్లయ్యింది. వీరు 13మంది పిల్లలు, 55మంది మనవళ్లు, మనవరాళ్లు, 54మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, 12మంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్‌ను చూశారు. ఒకరిపై ఒకరికి గల ప్రేమ, నమ్మకం వల్లే అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.