News September 9, 2024

బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా?

image

నిద్ర లేచిన రెండు గంటలలోగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ హెవీగా తినవచ్చు. రోజంతా పనులు చేస్తాం కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పెరుగు, పనీర్, సాల్మన్ వంటి ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే అల్పాహారంలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, వైట్ బ్రెడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మాంసం, సమోసా, పకోడీ, పూరీ వంటివి తీసుకోవద్దు.

Similar News

News July 10, 2025

రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యూట్యూబర్లు శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీయాదవ్, లోకల్ బాయ్ నాని సహా 29 మందిపై ED కేసు నమోదు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో FIR నమోదైన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలకు దిగింది.

News July 10, 2025

టోకెన్లు లేని భక్తులకు 20 గంటల సమయం

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న 76,501 మంది స్వామివారిని దర్శించుకోగా, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.

News July 10, 2025

స్మార్ట్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్!

image

తమ దగ్గర ఉన్న స్టాక్‌ను తగ్గించుకునేందుకు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించాలని వివిధ బ్రాండ్లు ఆలోచిస్తున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో సేల్స్‌ పడిపోవడంతో వచ్చే ఆగస్టు 15, రాఖీ, దీపావళికి స్టాక్ క్లియర్ చేయాలని భావిస్తున్నాయి. వన్‌ప్లస్, షియోమీ, ఐకూ, రియల్‌మీ, ఒప్పో, నథింగ్ బ్రాండ్ల వద్ద స్టాక్ ఎక్కువ ఉండడంతో డిస్కౌంట్లు ఇవ్వొచ్చు.