News May 26, 2024
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ సూచనలు

AP: పోస్టల్ బ్యాలెట్‌పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. RO సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13-Aపై RO సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని.. RO సంతకం, బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలంది. ఫామ్ 13-Aలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని పేర్కొంది.
Similar News
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.
News September 16, 2025
నానో ఎరువులను ఎప్పుడు పిచికారీ చేయాలి?

వరిలో నానో యూరియా, నానో DAPలను కలిపి పిలకలు తొడిగే దశలో, చిరు పొట్ట దశలో పిచికారీ చేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసుల పంటల్లో మొక్కల రెమ్మలు వచ్చే దశ, పూత దశలో స్ప్రే చేసుకోవచ్చు. పండ్ల తోటల్లో మామిడి పూతకు ముందు డిసెంబరు నెలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత పెరిగి మంచి దిగుబడులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. కాబట్టి పండ్ల తోటల్లో పూతకు ముందు నానో DAPని పిచికారీ చేసి మంచి ఫలితాలను పొందవచ్చు.