News May 26, 2024
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ సూచనలు

AP: పోస్టల్ బ్యాలెట్‌పై RO సీల్ లేకున్నా ఓటును తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. RO సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఫామ్ 13-Aపై RO సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలని.. RO సంతకం, బ్యాలెట్‌ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలంది. ఫామ్ 13-Aలో ఓటరు సంతకం, ఆర్వో సంతకం, సీరియల్ నంబర్ లేని పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవచ్చని పేర్కొంది.
Similar News
News April 11, 2026
వచ్చే వారం CBSE టెన్త్ ఫలితాలు?

వచ్చే వారం CBSE టెన్త్ క్లాస్ (సెషన్-1) ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 8వేలకు పైగా సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఈ ఏడాది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని CBSE నిర్ణయించింది. మొదటి సెషన్ కంపల్సరీ కాగా పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు రెండో సెషన్ రాయొచ్చు. మే 15 నుంచి జూన్ 1 వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
News April 11, 2026
సీజ్‌ఫైర్.. బియ్యం ధరలకు రెక్కలు!

పశ్చిమాసియాలో శాంతి చర్చలు బియ్యం ధరలకు రెక్కలు తెచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్‌తో అరబ్ దేశాల నుంచి ఎక్స్‌పోర్ట్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత 2 రోజుల్లోనే బియ్యం హోల్ సేల్ ధరలు 7% పెరిగాయి. ముంద్రా, కాండ్లా పోర్టుల ద్వారా సోమవారం నుంచి భారీగా ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే 15 రోజుల్లో రిటైల్ మార్కెట్లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
News April 11, 2026
శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.


