News April 4, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేరని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై EC స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది.

Similar News

News January 21, 2026

చీనీ, నిమ్మలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు (ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.

News January 21, 2026

శీతాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

image

శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. Broad-spectrum సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలని, దాని SPF 50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.

News January 21, 2026

మానస స్నానం అంటే తెలుసా?

image

మానస స్నానం అంటే నీటితో కాకుండా, మనసుతో చేసే పవిత్ర స్నానం. విష్ణువును ధ్యానిస్తూ, ఆయన రూపం, దివ్య నామాలను మనసులో నిలుపుకోవడమే దీని ఉద్దేశ్యం. పుండరీకాక్షుడిని స్మరించడం వల్ల లోపల, బయట కూడా శుద్ధి జరుగుతుంది. బాహ్య స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే, మానస స్నానం మనసులోని మలినాలను, అశాంతిని తొలగిస్తుంది. అన్ని రకాల స్నాన పద్ధతులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా, పుణ్యప్రదమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి.