News May 2, 2024

జగన్‌పై ఈసీ నిషేధం విధించాలి: ప్రత్తిపాటి

image

AP: సీఎం జగన్‌పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ‘జగన్ పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో ప్రతిపక్ష నేతలపై బురద జల్లుతున్నారు. పవన్, చంద్రబాబును అసభ్యంగా తిడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే ఏపీలో జగన్‌పైనా నిషేధం విధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 31, 2026

మున్సిపల్ ఎన్నికలు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,996 వార్డులకు 22,519 మంది అభ్యర్థుల నుంచి 29,743 నామినేషన్లు వచ్చాయి. పార్టీల వారీగా కాంగ్రెస్ 10,046, BRS 7564, BJP 5462, MIM 576, JSP 342, TDP 32, CPI 277, BSP 324, AAP 51, ఫార్వర్డ్ బ్లాక్ 241 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఉపసంహరణ గడువు FEB 3తో ముగుస్తుంది.

News January 31, 2026

నేను విన్నర్.. కింగ్ మేకర్‌ను కాదు: విజయ్

image

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. ‘నన్ను కింగ్ మేకర్‌ అనడం నాకు ఇష్టముండదు. కింగ్ మేకర్ అంటే మెయిన్ డ్రైవర్ కాదు.. సపోర్టర్. నేను గెలుస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్ ఎందుకవుతా? మా సభలకు వస్తున్న క్రౌడ్‌ను చూడట్లేదా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించానన్నారు.

News January 31, 2026

ఎప్‌స్టీన్‌ ఫైల్స్.. 3M+ డాక్యుమెంట్లు విడుదల

image

అమెరికా లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌కు సంబంధించి మరో 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లను US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ <<18618902>>విడుదల<<>> చేసింది. ఇందులో 2వేల వీడియోలు, 1.8లక్షల ఫోటోలు ఉన్నాయి. ఎప్‌స్టీన్‌ ఆస్తులు, ప్రముఖులకు అతడు చేసిన మెయిల్స్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు సమాచారం. ఎప్‌స్టీన్‌ కేసులో ప్రముఖుల పేర్లు వినిపించడంతో ట్రాన్స్‌పరెన్సీ కోసం ట్రంప్ ఫైల్స్‌ విడుదలకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.