News April 6, 2025
ఎకనామిక్ గ్రోత్ రేట్.. రెండో స్థానంలో AP: మంత్రి లోకేశ్

ఎకనామిక్ గ్రోత్ రేట్(2024-25)లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో నిలిచిందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన నివేదికను పంచుకున్నారు. AP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) ₹8.73 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 9.69% గ్రోత్ రేటుతో TN తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో AP (8.21%), అస్సాం (7.94), రాజస్థాన్ (7.82), హరియాణా(7.55), ఛత్తీస్గఢ్ (7.51), TG (6.69) ఉన్నాయి.
Similar News
News April 7, 2025
2030లోగా AIకి మానవ మేధస్సు: గూగుల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) 2030లోగా మానవులతో సమానమైన మేధస్సు(AGI)ను సాధిస్తుందని గూగుల్ డీప్మైండ్ అంచనా వేసింది. ఇది మానవ జాతిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ఓ నివేదికలో పేర్కొంది. అయితే ఈ సామర్థ్యాన్ని ఏఐ ఎలా సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించలేదు. AGI ముప్పును నియంత్రించడానికి గూగుల్తో పాటు ఇతర ఏఐ కంపెనీలు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నివేదిక ఫోకస్ పెట్టింది.
News April 7, 2025
ఆ‘రేంజ్’లో ఊహించుకుంటే..

గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని IPL-2025లో SRHపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా ఆరెంజ్ ఆర్మీ ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా వాటిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారీ స్కోర్లు అటుంచి కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన చేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సమష్టిగా రాణిస్తే అంచనాలను అందుకోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
News April 7, 2025
ట్రంప్ దెబ్బ.. మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిది!

ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత స్టాక్ మార్కెట్లు 3.9%, హాంకాంగ్- 8.7%, సింగపూర్- 7%, జపాన్- 6%, చైనా- 5.5%, మలేషియా- 4.2%, ఆస్ట్రేలియా- 4.1%, ఫిలిప్పీన్స్- 4%, న్యూజిలాండ్-3.6% నష్టపోయాయి. కొన్ని నెలల పాటు ఈ టారిఫ్స్ ఒడుదొడుకులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.