News November 11, 2024
Flipkart, Amazonపై ED చర్యలు?

Flipkart, Amazonపై ED కొరడా ఝుళిపించనున్నట్టు తెలుస్తోంది. కొంత మంది సెల్లర్లను మాత్రమే ప్రోత్సహిస్తూ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఈ సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి. విదేశీ సంస్థలు సెల్లర్లకు వేదికగా ఉండాలే తప్ప వస్తువులపై నియంత్రణ ఉండకూడదని చట్టం చెబుతోంది. ఇటీవల ED జరిపిన సోదాల్లో ఉల్లంఘనలు రుజువైనట్లు తేలింది. ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై ముందు నుంచీ విమర్శలున్నాయి.
Similar News
News January 21, 2026
గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరో ఐదేళ్లు(2030-31) పొడిగించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం APYలో 8.66 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 18-40 ఏళ్ల వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసును బట్టి రూ.42 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటాక రూ.1000-5000 వరకు పెన్షన్ అందుతుంది.
News January 21, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News January 21, 2026
‘2000s’ గ్యాంగ్.. క్రికెటర్ల సెల్ఫీ వైరల్

2000దశకంలో క్రికెట్ చూడటం మొదలుపెట్టిన వారికి పైఫొటోలో ఎవరో ఒకరు ఫేవరెట్ ప్లేయరై ఉంటారు. ఓపెనర్‌గా సెహ్వాగ్ బాదుడు, సిక్సర్ల వీరుడు యువరాజ్, ఫీల్డింగ్‌లో కైఫ్ దూకుడు, బౌలింగ్‌లో అగార్కర్, నెహ్రా సత్తా.. ఇలా అప్పట్లో వీరి ఆటకు క్రేజే వేరు. తాజాగా వీరంతా ఒకే దగ్గర కలుసుకొని సెల్ఫీ దిగారు. లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కుమారుడు అంగద్ బేడీ, స్పోర్ట్స్ ప్రజెంటర్ గౌరవ్ కపూర్ కూడా వీరితో ఉన్నారు.


