News November 11, 2024

Flipkart, Amazonపై ED చర్యలు?

image

Flipkart, Amazonపై ED కొర‌డా ఝుళిపించ‌నున్నట్టు తెలుస్తోంది. కొంత మంది సెల్లర్లను మాత్ర‌మే ప్రోత్స‌హిస్తూ భార‌త చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌ని ఈ సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విదేశీ సంస్థ‌లు సెల్లర్లకు వేదిక‌గా ఉండాలే త‌ప్ప వ‌స్తువుల‌పై నియంత్ర‌ణ ఉండ‌కూడ‌ద‌ని చ‌ట్టం చెబుతోంది. ఇటీవ‌ల ED జరిపిన సోదాల్లో ఉల్లంఘనలు రుజువైనట్లు తేలింది. ఈ-కామర్స్ వ్యాపార విధానాలపై ముందు నుంచీ విమర్శలున్నాయి.

Similar News

News February 8, 2026

భాను సప్తమి పూజా విధానం

image

తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించాలి. ఉదయించే సూర్యుడికి అభిముఖంగా నిలబడి, రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. పూజల ఎరుపు రంగు పూలు, ధూపం, దీపం సమర్పించాలి. సూర్య అష్టోత్తరం, గాయత్రీ మంత్రం జపించాలి. గోధుమలతో చేసిన వంటకాలు, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్యుడి దివ్య కాంతిపై దృష్టి కేంద్రీకరించి ప్రార్థనలు చేయాలి. ఇలా చేస్తే మన అడ్డంకులన్నీ తొలగి, ఉన్నత స్థితికి చేరుతామని నమ్మకం.

News February 8, 2026

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.

News February 8, 2026

శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 18 వరకు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రోజూ విశేష పూజలు, వాహనసేవలతో గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, వీఐపీ స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే శివదీక్షా భక్తులకు ఈ నెల 12 వరకూ స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.