News April 30, 2024
రేవంత్‌పై విచారణకు ఈడీ, ఐటీని దించాలి: మోదీకి కేసీఆర్ సవాల్

TG: జహీరాబాద్ సభలో ప్రధాని మోదీ <<13152991>>వ్యాఖ్యలపై<<>> BRS అధినేత కేసీఆర్ స్పందించారు. కొత్తగూడెం రోడ్‌షోలో మాట్లాడుతూ.. ‘CM రేవంత్ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ అన్నారు. వారిద్దరూ ఒకటి కాకపోతే వెంటనే సీఎంపై విచారణకు ఈడీ, ఐటీని దించాలి. గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోదీ అన్నారు. ఆయన వ్యాఖ్యలను రేవంత్ ఎందుకు ఖండించడం లేదు?’ అని ఫైరయ్యారు.
Similar News
News March 17, 2026
హోటల్స్ మూత… అన్న క్యాంటీన్లకు తాకిడి

AP: నిన్న మొన్నటి వరకు కొద్దోగొప్పో తెరిచి ఉన్న హోటళ్లు వాణిజ్య LPG కొరతతో మూతపడుతున్నాయి. ఆ ప్రభావం అన్న క్యాంటీన్లపై పడుతోంది. ఇదివరకు ఒక్కో క్యాంటీన్ ద్వారా మధ్యాహ్నం 500మందికి మీల్స్ అందించేవారు. హోటల్స్ మూతతో అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో 3PM వరకు మీల్స్ అందించగా ఇప్పుడు ఉద్యోగులు, విద్యార్థులూ వస్తుండడంతో 2PMకల్లా భోజనాలు అయిపోతున్నట్లు చెబుతున్నారు.
News March 17, 2026
ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.
News March 17, 2026
రాష్ట్రానికి అదనంగా 24వేల మెట్రిక్ టన్నుల LPG.. ఆందోళన వద్దు: CM

AP: ప్రస్తుతం 15 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.


