News September 28, 2024
మంత్రి పొంగులేటి ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాలు పొంగులేటికి చెందిన పలు ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేసింది. క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.
Similar News
News October 5, 2024
‘రాజా సాబ్’ టీమ్‌కు ప్రభాస్ సూచన?
మారుతి డైరెక్షన్‌లో ‘రాజా సాబ్’లో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా ఆయన లైనప్‌లో సలార్-2, స్పిరిట్, హను-ప్రభాస్, కన్నప్ప సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోపే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీమ్‌కు ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మెజారిటీ షూట్ పూర్తయిన నేపథ్యంలో త్వరగానే మిగతా షూట్ కూడా కంప్లీట్ కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి..
News October 5, 2024
అబుదాబిలో ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబిలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దేహ్‌తో కలిసి ఆయన NBA టోర్నీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ప్లేయర్లను మోటివేట్ చేసేందుకు ఆయన దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
News October 5, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: అక్టోబర్ 5, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:55 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:07 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
అసర్: సాయంత్రం 4:23 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:02 గంటలకు
ఇష: రాత్రి 7.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.