News March 23, 2024
కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆమె కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చిన అధికారులు.. మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని జడ్జిని కోరారు. దీంతో జడ్జి నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 14, 2024
తొలి టెస్టుకు టీమ్ ఇండియా వ్యూహమేంటో..!
బంగ్లాతో తొలి టెస్టులో భారత్ వ్యూహమేంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాక్టీస్ పిచ్‌లలో రెండు రకాలు కనిపిస్తున్నాయి. నల్లమట్టి పిచ్‌పై స్పిన్నర్లు, ఎర్రమట్టి పిచ్‌పై పేసర్లు సాధన చేశారు. ఈ రెండింటిపైనా బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలమే అయినప్పటికీ పేస్‌కు అనుకూలమైన ఎర్రమట్టి పిచ్‌ను మ్యాచ్ కోసం భారత్ రెడీ చేయించింది. దీంతో అసలు టీమ్ ఇండియా వ్యూహమేంటన్న చర్చ జరుగుతోంది.
News September 14, 2024
సోమవారం సెలవు
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. రేపు ఆదివారం, సోమవారం సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా 2 రోజులు హాలీడేస్ వచ్చాయి. మంగళవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మరోవైపు తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ సెలవును ప్రభుత్వం 17(మంగళవారం)న ఇచ్చింది. అదేరోజు హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది.
News September 14, 2024
కళ్యాణ్ రామ్ మూవీ.. 450 మందితో భారీ ఫైట్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో #NKR21 మూవీ తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ ఫైట్ సీన్ తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.