News March 28, 2024
ఆప్‌ని లేకుండా చేయడమే ఈడీ ఉద్దేశం: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడమే ఈడీ ఉద్దేశంలా కనిపిస్తోందని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల సందర్భంగా సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ‘ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. అప్రూవర్‌గా మారి బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని వాదించారు. దీనిపై ASG రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Similar News
News January 13, 2025
చైనాలో hMPV కేసులు తగ్గుతున్నాయ్
చైనాలో hMPV కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా దశాబ్దాలుగా ఉందని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని చైనా వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని వివరించారు. భారత్‌లో 17 hMPV కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
News January 13, 2025
లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు.. హాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర విమర్శలు
లాస్ ఏంజెలిస్‌లో చెలరేగిన కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఏర్పడిన నీటి కొరతకు హాలీవుడ్ నటులే కారణమని తెలుస్తోంది. విస్తారమైన వారి ఇంటి గార్డెన్ల నిర్వహణకు మోతాదుకు మించి నీటిని వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో పరిమితికి మించి నీటిని వినియోగించారని కిమ్ కర్దాషియన్‌కు ఫైన్ విధించారు. సిల్వస్టెర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి ప్రముఖులూ ఫైన్ చెల్లించిన వారిలో ఉన్నారు.
News January 13, 2025
పల్లెలు కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్
AP: రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని చెప్పారు. భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.