News February 17, 2025

GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

image

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్‌లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

Similar News

News March 27, 2025

‘రామ జన్మభూమి’ ఎడిషన్ వాచ్‌తో సల్మాన్

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘రామ జన్మభూమి’ స్పెషల్ ఎడిషన్ వాచ్ ధరించారు. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 30న థియేటర్లలో కలుసుకుందాం అని రాసుకొచ్చారు. ఆయన నటించిన ‘సికందర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఈ ఫొటో షేర్ చేశారు. వాచ్‌లో రాముడు, హనుమంతుడు, అయోధ్య ఆలయ డిజైన్లు ఉన్నాయి.

News March 27, 2025

డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

image

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News March 27, 2025

ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

image

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.

error: Content is protected !!