News April 3, 2025
స్టాక్ మార్కెట్స్‌పై ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్

US ప్రెసిడెంట్ ట్రంప్ వివిధ దేశాలపై టారిఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో యూఎస్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ప్రభావం ఏషియా మార్కెట్స్‌పై తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న లాభాల్లో ముగిసిన భారత సూచీలు ఇవాళ భారీ నష్టాలను చవిచూడొచ్చని భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు. కాగా భారత్, చైనా, కెనడా సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు.
Similar News
News April 20, 2025
తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.