News June 10, 2024
వరంగల్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్‌లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ ఇవ్వడం తెలుగు రాష్ట్రాలకు శుభపరిణామమని చెప్పారు. ఆయన సహాయంతో రెండు రాష్ట్రాల్లోని ఎయిర్ పోర్టులను సమర్థవంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.
News September 13, 2025
జగన్.. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండి: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని YS జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. 17 కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,450 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి, రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు. జగన్‌లా తాము విఫలం కావొద్దని PPPని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా ఉందని చెప్పారు.
News September 13, 2025
రేపే దాయాదుల పోరు.. సగం టికెట్లే సేల్!

UAEలో జరుగుతోన్న ఆసియా కప్‌పై భారత అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా రేపు జరిగే ఇండియా VS పాకిస్థాన్‌ను బైకాట్ చేయాలంటూ భారత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడవ్వాల్సిన దాయాదుల మ్యాచ్ టికెట్లు ఇప్పటికీ సగం కూడా అమ్ముడవలేదని సమాచారం. అమ్మకాలను పెంచేందుకు నిర్వాహకులు టికెట్ ధరలు కూడా తగ్గించారట. రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.