News December 3, 2024
రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు: మంత్రి పార్థసారథి

AP: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. ఐటీ, గ్లోబల్ కాంపిటీటీవ్ సెంటర్స్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. యువతీయువకులకు భరోసా కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ మారిటైం పాలసీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
Similar News
News December 25, 2025
ఐటీ జాబ్ వదిలి వ్యవసాయం.. రోజూ రూ.15వేలు ఆదాయం

రూ.లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలి.. సాగు బాట పట్టి సక్సెస్ అయ్యారు ఝార్ఖండ్‌లోని అంబతాండ్‌కు చెందిన యువరైతు ఉదయ్ కుమార్. బీటెక్ పూర్తి చేసి పుణేలో IT జాబ్ పొందిన ఉదయ్ సొంతూరిని వదిలి ఉండలేకపోయారు. 6 నెలలకే జాబ్ వదిలి, ఊరుకు వచ్చి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ పండిస్తూ రోజూ రూ.15వేలకు పైగా ఆర్జిస్తున్నారు. ఉదయ్ పడ్డ కష్టాలు, సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 25, 2025
క్రిస్మస్ శుభాకాంక్షలు

అంతటా క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. ప్రపంచమంతా కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు అంతా పవిత్ర పండుగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినప్పుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసు బోధించారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లోనే ఆయన ఉంటాడని చెబుతారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
News December 25, 2025
ఇతిహాసాలు క్విజ్ -107

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


