News December 3, 2024
రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాలు: మంత్రి పార్థసారథి

AP: రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి పార్థసారథి అన్నారు. ఐటీ, గ్లోబల్ కాంపిటీటీవ్ సెంటర్స్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. యువతీయువకులకు భరోసా కల్పించడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా దీనిని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీ మారిటైం పాలసీ, టెక్స్‌టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలిపినట్లు వివరించారు.
Similar News
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్ జోన్’లో అనంతపురం

అనంతపురం జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 1,500 మందికి పైగా టీనేజర్లు గర్భం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు.
News February 10, 2026
సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్‌పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్‌గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్‌గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్‌లో సూర్య చెలరేగడం తెలిసిందే.
News February 10, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.


