News August 20, 2024
మంకీపాక్స్ టీకా తయారీకి కృషి: సీరమ్
మంకీపాక్స్‌కు టీకా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే సానుకూల ఫలితాలు చూస్తామని అంచనా వేసింది. ప్రమాదంలో పడ్డ లక్షల మంది కోసం వ్యాక్సిన్ తయారు చేస్తామంది. ఆందోళన కలిగిస్తున్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి భారత్‌లో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాధిపై ఇప్పటికే సూచనలు ఇచ్చింది.
Similar News
News September 20, 2024
సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా: సీఎం రేవంత్
TG: దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘మొత్తం 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ఇస్తున్నాం. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించాం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం. కార్మికులు, ఉద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
News September 20, 2024
భారీ ఆధిక్యం దిశగా టీమ్ ఇండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 308 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4 వికెట్లతో చెలరేగారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (12), శుభ్‌మన్ గిల్ (33) ఉన్నారు.
News September 20, 2024
ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కనాలి: సీఎం చంద్రబాబు
AP: చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబర్చడం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళా ఇద్దరు పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. APని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మన GOVT కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి? ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది’ అని అన్నారు.