News February 23, 2025

రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ

image

TG: రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పి.విశ్వప్రసాద్-క్రైమ్స్ అదనపు కమిషనర్ HYD, బి.నవీన్ కుమార్-CID ఎస్పీ HYD, గజారావు- ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సైబరాబాద్, డి.జోయెల్ డేవిస్-ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ HYD, సిరిశెట్టి సంకీర్త్ గవర్నర్ ADC, బి.రాంరెడ్డి- CID SP HYD, సీహెచ్ శ్రీధర్-ఇంటెలిజెన్స్ ఎస్పీ HYD, ఎస్.చైతన్య కుమార్-SB డీసీపీ HYD.

Similar News

News February 23, 2025

పెళ్లిలోనూ భారత్ VS పాక్ మ్యాచ్ LIVE

image

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని ఓ పెళ్లి మండపంలో మ్యాచ్‌ను చూసేందుకు ఏకంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఓ వైపు పెళ్లి, మరోవైపు మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సండే కావడంతో దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.

News February 23, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. తిరిగి వచ్చిన షమీ

image

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో భారత స్టార్ బౌలర్ షమీ మైదానాన్ని వీడి, తిరిగి వచ్చారు. బౌలింగ్ వేస్తున్న సమయంలో కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడ్డారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు. మరోవైపు పాకిస్థాన్ 8.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. బాబర్ ఔటయ్యారు.

News February 23, 2025

టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి జూపల్లి

image

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సైనిక బృందాలతో పాటు టన్నెల్‌లోనికి మంత్రి జూపల్లి వెళ్లారు. నీరు, బురద ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

error: Content is protected !!