News November 26, 2024

రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ శిండే

image

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగుస్తుండటంతో CM ఏక్‌నాథ్ శిండే రాజీనామాకు సిద్ధమయ్యారని తెలిసింది. ఉదయం 11 గంటల తర్వాత ఆయన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారని సమాచారం. కొత్త సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. బీజేపీ పెద్దలు, శివసేన, ఎన్సీపీ నేడు సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. అప్పటి వరకు శిండేను ఆపద్ధర్మ సీఎంగా గవర్నర్ కొనసాగిస్తారని తెలుస్తోంది.

Similar News

News November 26, 2024

నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర

image

AP: తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటివరకు రక్షణ కల్పించిన YCP, TDP ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. YCP ప్రభుత్వం గతంలో శారదాపీఠానికి వైజాగ్ వద్ద రూ.225Cr విలువైన 15ఎకరాలను రూ.15 లక్షలకే కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది.

News November 26, 2024

పుష్ప-2కు మూడో మ్యూజిక్ డైరెక్టర్?

image

పుష్ప-2 ప్రాజెక్టులోకి ముచ్చటగా మూడో సంగీత దర్శకుడు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైదీ, క, డిమోంటీ కాలనీ-2 తదితర చిత్రాలకు పనిచేసిన శామ్ CS పుష్పలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌కు BGM అందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ జాతర గెటప్‌ను ఆయన ఇవాళ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. DSPతో పాటు తాను BGM అందిస్తున్నట్లు తమన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

News November 26, 2024

మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీదే?

image

మహారాష్ట్ర సీఎం ఎవరనే సందిగ్ధానికి తెర పడినట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శిండే వర్గానికి 12, అజిత్ వర్గానికి 10 చొప్పున మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం.