News November 26, 2024

రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ శిండే

image

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో ముగుస్తుండటంతో CM ఏక్‌నాథ్ శిండే రాజీనామాకు సిద్ధమయ్యారని తెలిసింది. ఉదయం 11 గంటల తర్వాత ఆయన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారని సమాచారం. కొత్త సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. బీజేపీ పెద్దలు, శివసేన, ఎన్సీపీ నేడు సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. అప్పటి వరకు శిండేను ఆపద్ధర్మ సీఎంగా గవర్నర్ కొనసాగిస్తారని తెలుస్తోంది.

Similar News

News March 15, 2026

విశాఖ: విద్యుత్ సమస్యలు ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు

image

AP: రాష్ట్రంలో రానున్న 3రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో భిన్న వాతావరణం ఉంటుందని APSDMA అంచనా వేసింది. ద్రోణి, నైరుతి నుంచి వీచే గాలులతో రేపు SKLM, VZM, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసేందుకు ఆస్కారం ఉందని చెప్పింది.