News March 17, 2024
ELECTION CODE: తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్

సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమల దర్శనంపై పడింది. ఇకపై తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది. స్వయంగా వచ్చే సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సిఫారసు లేఖలు చెల్లవు.
Similar News
News April 5, 2025
రెండో రోజూ భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గి సామాన్యుడికి కాస్త ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹980 తగ్గి ₹90,660కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹900 తగ్గి ₹83,100గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,07,900కి చేరింది. కాగా, రెండ్రోజుల్లో తులం బంగారం రేటు రూ.2720 తగ్గడం విశేషం.
News April 5, 2025
మెగా డీఎస్సీపై BIG UPDATE!

AP: రాష్ట్రంలో మెగా DSC నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. SC వర్గీకరణ రోస్టర్ పాయింట్లపై గవర్నర్ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్ ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు. ఆ తర్వాతి రోజే నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. ముందుగా చెప్పినట్లే 16,347 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ప్రక్రియ పూర్తి చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
News April 5, 2025
నేటి నుంచి ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

AP: ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన ఒంటిమిట్టలో నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, రేపు ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. ఈ నెల 11న రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులు హాజరవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.