News March 17, 2024

ELECTION CODE: తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లవ్

image

సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం తిరుమల దర్శనంపై పడింది. ఇకపై తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. ఇందుకు భక్తులు సహకరించాలని కోరింది. స్వయంగా వచ్చే సెలబ్రిటీలు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ సిఫారసు లేఖలు చెల్లవు.

Similar News

News April 17, 2026

LNG ఇంపోర్ట్స్.. భారత్‌కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

image

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్‌పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్‌కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.

News April 17, 2026

హార్ముజ్‌ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్‌లోని మైన్స్‌ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.

News April 17, 2026

ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

image

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.