News February 9, 2025
‘ఏకగ్రీవాలకు’ ఎన్నికల సంఘం చెక్!

TG: ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే హరియాణా, MHలో అమల్లో ఉంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం అంగీకరిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News December 2, 2025
మళ్లీ వేలంలోకి ‘HR88B8888’.. ఎందుకంటే?

హరియాణాలో ‘HR88B8888’ అనే వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వేలంలో రూ.1.17 కోట్లు పలికి దేశవ్యాప్త చర్చకు దారితీసిన <<18396670>>విషయం<<>> తెలిసిందే. ఈ నంబర్‌ను తిరిగి వేలం వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 50,000 కనీస ధరతో ప్రారంభమైన గత ఆన్లైన్ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. అయితే ఈ నంబర్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి నిర్ణీత గడువులో డబ్బు చెల్లించలేదు. దీంతో మళ్లీ వేలంపాట నిర్వహిస్తున్నారు.
News December 1, 2025
చలికాలం స్వెటరు వేసుకుని పడుకుంటున్నారా?

చలికాలం కొందరు స్వెటరు వేసుకుని పడుకుంటారు. అయితే దానికి బదులు కాటన్, లెనిన్, బ్రీతబుల్ దుస్తులు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ‘స్వెటరే వేసుకోవాలి అనుకుంటే టైట్‌గా ఉండేది వద్దు. దాంతో బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరగదు. కాస్త లూజ్‌గా, పొడిగా, బ్రీతబుల్, శుభ్రంగా ఉండేది వేసుకోండి. వింటర్లో కాళ్లకు సాక్సులు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. అవి కూడా శుభ్రంగా, కాస్త లూజ్‌గా ఉండాలి’ అని చెబుతున్నారు.
News December 1, 2025
GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC)లో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై ముందడుగు పడింది. ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం త్వరలోనే గెజిట్ జారీ చేయనుంది. కాగా <<18393033>>ఈ విస్తరణతో<<>> 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.


