News February 9, 2025
‘ఏకగ్రీవాలకు’ ఎన్నికల సంఘం చెక్!

TG: ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే హరియాణా, MHలో అమల్లో ఉంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం అంగీకరిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News February 10, 2026
US-బంగ్లా ట్రేడ్ డీల్.. 1 శాతం సుంకం తగ్గింపు!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్స్‌ను 20% నుంచి 19%కి అమెరికా కుదించింది. అంటే కేవలం 1% తగ్గించింది. నిజానికి బంగ్లా గూడ్స్‌పై 37% సుంకాలు విధించాలని మొదట్లో ప్రతిపాదించినా.. తర్వాత 20%కి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. తాజా డీల్‌తో US మెటీరియల్స్‌తో తయారు చేసిన పలు టెక్స్‌టైల్, అప్పెరల్ గూడ్స్‌కు జీరో టారిఫ్ యాక్సెస్ దొరుకుతుందని బంగ్లా అడ్వైజర్ యూనస్ ట్వీట్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఆయుష్ మిషన్‌లో ఉద్యోగాలు

<
News February 10, 2026
ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
వివేకవంతులు ఎవరి గురించి అతిగా చింతించరు. ఇతరుల ప్రవర్తన, పరిస్థితులను మార్చలేమని తెలిసి కూడా వారి గురించి ఆలోచించడం వ్యర్థం. దానివల్ల మనశ్శాంతి పోతుంది. వారి కర్మలను మనం మోయలేం. మన చేతుల్లో లేని విషయాల గురించి బాధపడటం అవివేకం. అందుకే అతిగా ఆలోచించి కాలాన్ని వృధా చేసేకంటే, మన ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమం. <<-se>>#MSBP<<>>


