News June 3, 2024
ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News January 18, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ.300పైనే కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర రూ.300-320గా ఉంది. గుంటూరు, విశాఖలో రూ.300, నంద్యాల రూ.260-300, కామారెడ్డిలో రూ.300-310, కర్నూలులో రూ.310-320కి విక్రయిస్తున్నారు. అమలాపురంలో రూ.250 నుంచి రూ.300కి పెరిగింది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 18, 2026
మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
News January 18, 2026
బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పీచు ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు తీసుకోవాలి. ఐరన్ లోపం రాకుండా ఆప్రికాట్స్, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్, చిరుధాన్యాలు, గోధుమలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


