News June 3, 2024

ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి

image

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News September 17, 2024

ఆత్మవిశ్వాసంలో కోహ్లీకి ఎవరూ సాటిరారు: సర్ఫరాజ్ ఖాన్

image

విరాట్ కోహ్లీ యంగ్ ప్లేయర్లకు ఎప్పుడూ అండగా ఉంటూ విలువైన సూచనలు ఇస్తుంటాడని సర్ఫరాజ్ ఖాన్ ప్రశంసించారు. క్రికెట్ పట్ల ప్యాషన్, ఆత్మవిశ్వాసంలో ఆయనకెవరూ సాటిరారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IPLలో 2015-18 మధ్య RCB తరఫున కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనే తన కల భవిష్యత్తులో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 17, 2024

న్యూయార్క్‌లో ఆలయం ధ్వంసం.. ఖండించిన భారత కాన్సులేట్

image

న్యూయార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయంలో ఓ భాగాన్ని దుండగులు <<14119738>>ధ్వంసం<<>> చేయడాన్ని అక్కడి భారత కాన్సులేట్ తీవ్రంగా ఖండించింది. ఇది హేయమైన చర్య అని మండిపడింది. నిందితులను అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను కోరింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. ఇటీవల హిందూ సంఘాలకు బెదిరింపులు వచ్చాయని, ఇప్పుడు దాడి జరిగిందని పేర్కొంది.

News September 17, 2024

వైద్యుల డిమాండ్.. కోల్‌కతా సీపీపై సీఎం మమత వేటు

image

వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులతో సీఎం మమతా బెనర్జీ చర్చలు సానుకూలంగా జరిగాయి. వారి డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను ఆమె తొలగించారు. నార్త్ జోన్(RGకర్ కాలేజీ ఉన్నప్రాంతం) పోలీస్ చీఫ్, ఇద్దరు హెల్త్ ఉన్నతాధికారులపై వేటు వేశారు. ఆందోళన చేసిన వైద్యులపై చర్యలు ఉండబోవని CM హామీ ఇచ్చారు. ఇతర డిమాండ్లపై CS నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.