News May 12, 2024
ఏపీలో ఎన్నికలు.. ఈసీ కీలక హెచ్చరిక

AP:ఓటర్ల వేళ్లపై ఇతర సిరాల ద్వారా మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా హెచ్చరించారు. ‘ఇంటి వద్దే వేళ్లపై మార్కు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం మాత్రమే చెరగని సిరా తయారుచేస్తుంది. ఇది EC వద్దే అందుబాటులో ఉంటుంది. ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు సమాచారం. ఎవరైనా ఇతర సిరాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవు’ అని స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2025
లిక్కర్ స్కాం నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో అధికారులు విజయవాడ ACB కోర్టుకు తీసుకొచ్చారు. కాగా కోర్టు డిసెంబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో YCP ఎంపీ మిథున్ రెడ్డి సైతం కోర్టుకు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా పడింది.
News November 21, 2025
రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.
News November 21, 2025
SBI పేరిట వెబ్సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


