News March 20, 2024
రాష్ట్రంలో ఎన్నికలు.. వాలంటీర్లపై కీలక ఆదేశాలు
AP: గ్రామ, వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టం చేసిన ఆయన.. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించరాదన్నారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 15, 2024
నెలాఖరులోగా ‘నామినేటెడ్’ భర్తీ!
AP: భారీ వర్షాలు, వరదలతో వాయిదా పడిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే 80% పోస్టులపై కసరత్తు పూర్తవగా, మిగతా వాటిపై కూటమి నేతలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. TDP, JSP, BJPలకు 60:30:10 రేషియోలో పంపకాలు ఉంటాయని సమాచారం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తవుతుందని, గత ప్రభుత్వంపై పోరాటం, కూటమి గెలుపు కోసం కీలకంగా పనిచేసినవారికే ప్రాధాన్యత ఉంటుందని కూటమి వర్గాలు తెలిపాయి.
News September 15, 2024
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
AP: ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. OCT 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News September 15, 2024
IPLలో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్.. షాకయ్యా: ధ్రువ్ జురెల్
IPLలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కలిసి ఆడిన జో రూట్ టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ చేయడంతో షాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు. ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ENGతో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ‘రూట్ అదేపనిగా నన్ను స్లెడ్జింగ్ చేశారు. అతని మాటలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు’ అని పేర్కొన్నారు.